46 నెలల్లో ఎమ్మెల్యేగా ఆనం చేసిందేమిటో? అవి ఏవో మీకు తెలుసా?
I ఆనం గ్యాంగ్‌కు వైసిపి నేతల ప్రశ్నలు
(వెంకటగిరి` వెంకటగిరి పక్స్‌ప్రెస్) నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిని తిట్టడమే ధ్యేయంగా వైసిపి పేరుతో మీటింగ్ పెట్టిన ఆనం గ్యాంగ్‌కు నియోజకవర్గంలోని వైసిపి నాయకులు రిటర్న్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం నాడు వైసిపి నాయకులు పల్ కోటేశ్వరరావు, శాతరాజు బాలయ్య, వెందోటి మధురెడ్డి, కార్తీక్‌రెడ్డి, పాపకన్ను మధురెడ్డి, మన్నారపు రవికుమార్, చిట్టేటి హరికృష్ణ, చెలికం శంకర్‌రెడ్డి, జి ఢల్లీిబాబు, కాల్తిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, పులిప్రసాద్రెడ్డి తదితరులు పన్జెఆర్ భవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జ్గా వుంటూ జనం కోసం స్వంత నిధులు సైతం లక్షల రూపాయలు ఖర్చుపెట్టి సేవలందించారన్నారు. మీకు మీరే వైసిపి నుంచి దూరమై, మీ నాయకుడు ఆనం రామనారాయణరెడ్డి లాగా మంత్రి పదవులకు, ఎమ్మెల్యే టిక్కెట్ల వేటలో సమన్వయం కోల్పోయింది మీరేనని ధ్వజమెత్తారు. చిలక్కి చెప్పినట్లు హితవుపలికినా, భవిష్యత్తును రోడ్లమీద పారేసుకోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. కలిసిమెలిసి పనిచేసుకుంటేనా ఎవరికైనా రాజకీయ భవిష్యత్తు వుంటుందని, ఒకరిదాంట్లో వేలిపెట్టి రాజకీయం చేస్తే రేపు మనకు కూడా ఇవే వర్తిస్తాయన్న సంగతి గుర్తుపెట్టుకోవాలన్నారు.
ఈ సందర్భంగా వారు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి 14 నెలలు ఇన్చార్జ్ పాలనలో వెంకటగిరి నియోజకవర్గం పరిధిలో చేసిన కొన్ని ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.