బిసిలకు సరికొత్త అధ్యాయం మొదలైంది
I నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి నాయకత్వాన జగన్ సమక్షంలో వైసిపిలో చేరిన మస్తాన్‌యాదవ్
(వెంకటగిరి` వెంకటగిరి పక్స్‌ప్రెస్)
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ బొలిగల మస్తాన్ యాదవ్ బుధవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైపస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరారు. వెంకటగిరి వైసిపి అభ్యర్థి, తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి నాయకత్వాన వెంకటగిరి నియోజకవర్గంలో తప్పకుండా బిసిలకు ఒక మంచి గుర్తింపు, రాజకీయ ప్రాధాన్యత వుంటుందన్న నమ్మకంతో పార్టీలో చేరానని ఈ సందర్భంగా వెల్లడిరచారు.
నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి మాటల్లో నిజాయితీ వుంటుందని, తనకు ఇక్కడి రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే అర్థమైందన్నారు. కల్లబొల్లి కబుర్లు చెప్పి కార్యకర్తల్ని మోసం చెయ్యడమే రాజకీయం అని అర్థాలు మారుస్తున్న ఈరోజుల్లో ఇచ్చిన మాట కోసం ఎంతదూరమైనా కార్యకర్తలకు, ప్రజలకు అండగా నిలిచే కుటుంబం నేదురుమల్లిదన్నారు.
ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇక నుంచి ఓ లెక్క
వెంకటగిరి నియోజకవర్గంలో ఇప్పటిదాకా బిసిల ఉనికి, ఉద్యోగం, ఉపాధి, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ఒక లెక్కగా నడిచాయని, నేదురుమల్లి నాయకత్వాన ఇక నుంచి ఇంకో లెక్కగా పరిగెత్తిస్తామన్నారు.
బిసిలు రాజ్యాధికారంలోకి రాకపోవడం, ఎదగకపోవడానికి ప్రధాన కారణం తీరిక లేకపోవడమేనని సంచల విషయాన్ని ప్రకటించారు.
బిసిలు ప్రధానంగా కులవృత్తుల మీద ఆధారపడి, అరకొరా భూములతో సేద్యం చేసుకుంటూ రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలు ఎక్కువగా వుంటాయన్నారు. వారు కూడా కొంత తీరిక చేసుకుని ఇక నుంచి రాజకీయాల గురించి ఆలోచించేలా మార్పును, తీరికను, కల్పించడం బిసిల్లోని యువ చైతన్యానికి నాయకత్వశిక్షణ అందిస్తానన్నారు. ప్రతి ఒక్క అడుగు ముందుకు కదులుతుంటే ఎప్పుడో ఒకసారి ఒక గమ్యానికి చేరుకుంటామని, టిడిపిలో ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా నియోజకవర్గంలో బిసిలు వుండిపోయారన్నారని మస్తాన్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.