వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
*ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిస్కారం కొరకు నిరంతరం కృషి చేయుచున్నది ఎంప్లాయిస్ యూనియన్ మాత్రమే.
ఆర్టీసి ఇ.యు రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.వి.నరసయ్య
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పి. సుబ్రహ్మణ్యం రాజు
ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తరువాత ఉత్పన్నమైన అనేక సమస్యలను గౌరవ MD శ్రీ ద్వారకా తిరుమలరావు , ప్రభుత్వముతో చర్చించి పరిష్కరింప చేయుచున్నది ఎంప్లాయిస్ యూనియన్ మాత్రమే అని రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.వి. నరసయ్య తెలిపారు ఈ రోజు వెంకటగిరి లోని నాగేశ్వరి కల్యాణమండపం నందు ఎపి పిటిడి ఎంప్లాయిస్ యూనియన్ వెంకటగిరి డిపో జనరల్ బాడీ సమావేశం జోనల్ నాయకులు Y.V.ప్రసాద్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశమునకు ముఖ్య అతిధులుగా రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.వి.నరసయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పి.సుబ్రహ్మణ్యం రాజు పాల్గొన్నారు. త్వరలో అందరికి లామినేటెడ్ డిజిటల్ ఇండెంటిటీ కార్డ్స్ ఇస్తున్నారని, 2017 పే-స్కేల్స్ అరియర్స్ 2031 నుండి 2060 వరకు రిటైర్డ్ అయ్యే వారికి ఇప్పుడు 50% ఇస్తున్నారు ఇంకో 50% పూర్తిగా ఒకే సారి ఇవ్వాలని కోరియున్నాము త్వరగా ఇప్పించుటకు కృషి చేస్తున్నామని తెలిపారు.*
మరియొక ముఖ్య అతిధి పి. సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ద్వారా ఏర్పడుచున్న ఇబ్బందులను గౌరవ MD గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొనివెల్లినమని తెలిపారు,
*ఈ కార్యక్రమములో రాష్ట్ర నాయకులు శ్రీమతి మురుగమ్మ, జోనల్ నాయకులు విజయకుమార్, రవికుమార్, జిల్లా అధ్యక్ష-కార్యదర్శులు టి.సత్యనారాయణ, డి.గురునాధం అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు
నూతన కమిటి ఎన్నిక
ఈ సందర్బంగా వెంకటగిరి డిపో ఎంప్లాయిస్ యూనియన్ నూతన కమిటీ