వెనకుంటే ఓ రేటిస్తామంటున్న ఆనం గ్యాంగ్
I డబ్బులిచ్చి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లను కొనడం అంటే రాజ్యాంగాన్ని అవమానపరచడమా?
(వెంకటగిరి` వెంకటగిరి పక్స్‌ప్రెస్) ఆనం గ్యాంగ్ వైసిపి అభ్యర్థులను డబ్బు సంచులతో గత రెండు రోజులుగా కొనడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. వెంకటగిరి నియోజకవర్గంలో వైసిపి తరపున స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందిన ప్రతి అభ్యర్థికి ఒక్కోరేటు ఫిక్స్ చేసి ఆత్మీయ సమావేశం పేరుతో ఆహ్వానిస్తోంది. మా పక్కనొచ్చి నిలబడితే డబ్బులిస్తాం అని వైసిపి ప్రజాప్రతినిధులకు ఎరలు వేస్తోంది. బాహాటంగా సర్పంచ్‌లకు ఒక రేటు, కౌన్సిలర్లకు ఒక రేటును ఫిక్స్ చేసి ఫోన్‌చేసి ఆహ్వానించడంపై ఆ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అభీష్టంతో తాము ఎన్నికల్లో గెలిచి విజయం సాధించామని, ఇప్పుడు వాళ్ళ పక్కనొచ్చి నిలబడటానికి రేటిచ్చి ఆహ్వానించడం ప్రజల నిర్ణయాన్ని అపహాస్యం చెయ్యడం, వైసిపి పార్టీని అప్రతిష్టకు గురిచేసే చర్యని ప్రజా ప్రతినిధులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పత్రికా ముఖంగా అసలు ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పే ధైర్యం కూడా లేకుండా వైసిపిని జనం ముందు పలచని చేసే చర్యకు ఆనం గ్యాంగ్ పూనుకుంటోందని జగనన్న సైనికులు దుయ్యబడుతున్నారు. సాక్ష్యాత్తు వైసిపి అభ్యర్థి ఆదివారం నాడువిలేకరులతో మాట్లాడుతూ ఆనం గ్యాంగ్ తమ ఆగడాలకు వెంకటగిరిని వేదికగా చేసుకుని ప్రజాప్రతినిధులకు డబ్బులతో ఎరవేస్తోందని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఇదిలా వుండగా శనివారం, ఆదివారం రెండు రోజులపాటు ప్రజాప్రతినిధులకు డబ్బులతో ఎరలు వేసిన ఫోన్ కాల్స్ అన్నీ కూడా వైసిపి అధిష్టానంకు చేరినట్లు తెలిసింది. అలాగే వైపస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆనం గ్యాంగ్ చేస్తున్న అరాచకాలపై అధిష్టానం చాలా సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. ఆదివారం సాయంత్రానికి ఈ సమాచారం తాడేపల్లి గూడెంకు చేరి దీని వెనుక ఉన్న సూత్రధారులు, మండలాల వారీగా ఉన్న పాత్రధారులపై ఆరాతీస్తున్నట్లు సమాచారం. రీజనల్ కోఆర్డినేటర్లకు ఆనం గ్యాంగ్ ప్రజా ప్రతినిధులకు డబ్బులతో ఎర వేసిన విషయం తెలుసుకుని చాలా సీరియస్ అయినట్లు తెలియవచ్చింది. జగనన్న సైనికులకే రేటుకట్టి మీటింగ్‌లకు దిగుతారా అని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. గతంలో ప్రజాప్రతినిధుల్ని పక్కన పెట్టుకుని మాజీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ముఖ్యమ,త్రి వైపస్ జగన్మోహన్రెడ్డిని తిట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆ సమయంలో అక్కడున్న ప్రజాప్రతినిధులు నెవ్వెరపోయి, తమకేమి సంబంధం లేదని జారుకున్నారు. ఇప్పుడు కూడా టిక్కెట్ విషయమై ప్రజాప్రతినిధుల్ని పక్కన పెట్టుకుని వైపస్ జగన్మోహన్రెడ్డిని, ఆయన నిర్ణయాలను తిట్టిస్తాడన్న భయం కూడా వుంది. ఇదిలా వుండగా ఈమొత్తం వ్యవహారంపై వెంకటగిరి నియోజకవర్గం వైసిపి అభ్యర్థి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.