తిరుపతి అభ్యర్థితో కలిసి మేమంతా సిద్ధం పోస్టర్ ఆవిష్కరణ
(వెంకటగిరి` వెంకటగిరి పక్స్‌ప్రెస్)
తిరుపతి, చిత్తూరు జిల్లాల అభ్యర్థులతో వైసిపి రీజనల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో శనివారం నాడు మేమంతా సిద్ధం పేరుతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గెలుపు వ్యూహాల గురించి చర్చించుకున్నారు. ఈ సమావేశానికి తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. తిరుపతి అభ్యర్థి అభినయ్‌తో కలిసి మేమంతా సిద్ధం పోస్టర్‌ను ఆవిష్కరించారు.