కుమార్తెతో పాటు హాజరైన కురుగొండ్ల రామక్రిష్ణ
(వెంకటగిరి` వెంకటగిరి పక్స్‌ప్రెస్)
విజయవాడలోని ప1 కన్వెన్షన్ సెంటర్లో 2024 ఎన్నికల్లో పోటీచేస్తున్న ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థుల వర్క్‌షాపు జరిగింది. ఈ వర్క్‌షాపుకు వెంకటగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కురుగొండ్ల లక్ష్మీసాయిప్రియ హాజరైంది. ఆమెతోపాటు తండ్రి కురుగొండ్ల రామక్రిష్ణ కూడా హాజరయ్యారు. గెలుపు వ్యూహాల గురించి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అభ్యర్థులకు బోధించారు. తొలిసారిగా ప్రత్యక్షరాజకీయాల్లోకి వచ్చిన లక్ష్మీసాయిప్రియకు సీనియర్ లీడర్ గోరంట్ల బుచ్చయ్యచౌదరిని కురుగొండ్ల రామక్రిష్ణ పరిచయం చేసి ముచ్చటించుకున్నారు.