వెంకటగిరి వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
ఏప్రిల్ 4న తిరుపతి జిల్లాలో సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర
జిల్లాలో జరగనున్న సీఎం వైఎస్ జగన్ కార్యక్రమంలో వెంకటగిరి నేతలు క్రియాశీలకంగా పాల్గొనాలి
వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి తిరుపతి జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వెల్లడి మేము సిద్ధం కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్నబస్సు యాత్ర ఈనెల 4న తిరుపతి జిల్లాలో నిర్వహించనున్నట్లు వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి , తిరుపతి జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు నేదరుమల్లి రామ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. తిరుపతిలోని వైఎస్ఆర్సిపి రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కార్యాలయంలో శనివారం జరిగిన మేము సిద్ధం సన్నాహక సమావేశంలో తిరుపతి చిత్తూరు జిల్లాల ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలతో కలిసి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు
ఈ సందర్భంగా నేదురు మల్లి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కార్యక్రమం ద్వారా పూర్తిగా ప్రజల్లోనే జగన్ ఉంటారని, రాత్రి బస కూడా ఆయా జిల్లాలోనే ఉంటుందని పార్టీ పెద్దలు తెలియజేశారు అన్నారు. జిల్లాలో జరిగే కార్యక్రమం కు వెంకటగిరి నుండి అధిక సంఖ్యలో వైఎస్ఆర్సిపి శ్రేణులు తరలి వెళ్లి కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపారు . సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం పూర్తి వివరాలు త్వరలోనే పార్టీ పెద్దలు తెలియజేస్తారని తెలిపారు