వెంకటగిరి.. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
– వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి ,తిరుపతి జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డివైఎస్ఆర్ సీపీలో లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామని వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి తిరుపతి జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తెలిపారు . శనివారం పట్టణంలోని ఎనిమిదో వార్డు వైఎస్ఆర్సిపి నాయకురాలు జలగం కామాక్షి ఆధ్వర్యంలో ఆ వార్డుకు చెందిన పలువురు మహిళలు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నేదరుమల్లి మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో అన్ని పథకాల్లో మహిళల పేరుమీదే ఇస్తున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన మేలు ప్రజలకు వివరించి అధిక మెజార్టీ తో పార్టీ గెలుపుకు కష్టపడి పనిచేయాలని కోరారు. దీంతో మహిళలు స్పందిస్తూ వైఎస్సార్సీపీ విజయానికి డోఖా లేదని, వేంకటగిరి ఎమ్మెల్యే గా మిమ్మల్ని అత్యధిక మెజారిటీ తో గెలిపించుకునే బాధ్యత తీసుకునీ వార్డ్ లో కష్టపడి పనిచేస్తామని ముక్తకంఠంతో హామీ ఇచ్చారు.