వైయస్ఆర్సీపీ విజయానికి పార్టీలో చేరిన నాయకులు కార్యకర్తలు రెండు నెలల పాటు కష్టపడితే భవిష్యత్తులో మీకు అండగా నిలుస్తానని వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. స్థానిక నేదురుమల్లి నివాసంలో శుక్రవారం డక్కిలి మండలం చాకలపల్లి దళిత వాడకు చెందిన పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు ఆ గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు ప్రకాశం నాయుడు సునీల్ మాధవ్ ల ఆధ్వర్యంలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సిపి లో చేరారు. పార్టీలో చేరిన వారికి ఆయన పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నేదురుమల్లి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారని, వారు వైఎస్సార్సీపీలో చేరుతున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయానికి కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల జెసిఎస్ కన్వీనర్ చింతల శ్రీనివాసులు రెడ్డి, లింగసముద్రం పంచాయతీ వైఎస్సార్సీపీ నాయకులు పి పరందమయ నాయుడు గోవర్ధన్ నాయుడు దేవలపల్లి మాజీ సర్పంచ్ మాదమాల లక్ష్మీనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
వైయస్సార్సీపి గెలుపే లక్ష్యం కావాలి
– వైఎస్ఆర్సిపి వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి
వెంకటగిరి వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గంలో వైయస్సార్సీపి గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఆ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి సూచించారు. వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసంలో శుక్రవారం ఆయనను కలిసిన నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆ నాయకులు తమ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం కార్యాచరణ, పలు రాజకీయ అంశాలను ఆయనతో చర్చించారు. నేదురు మల్లి మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సూచనల మేరకు వారి నిబంధనలకు అనుగుణంగా పోటీకి అవసరమైన ఏర్పాట్లు, ప్రచార కార్యక్రమాల ప్రణాళికలు ముమ్మరం చేస్తామని తెలిపారు. కలువాయి మండల జె సి ఎస్ కన్వీనర్ మాదాసు పవన్ ఆధ్వర్యంలో మండలానికి చెందిన పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు నేదరుమల్లి రామ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
నేదురు మల్లికి కృతజ్ఞతలు తెలిపిన కోళ్ల ఫారం సెంటర్ వాసులు…
వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని కోళ్ల ఫారం సెంటర్లో రామాలయ నిర్మాణానికి మార్గం సుగమం చేసిన వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి ఆ ప్రాంతవాసులు కృతజ్ఞతలు తెలియజేశారు. గత కొంతకాలంగా ఆ ప్రాంతంలో రామాలయ నిర్మాణం పై ఇరు వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో సున్నితమైన ఆ సమస్యను నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అధికారుల సహకారంతో ఇరువర్గాలను ఒప్పించారు. ఈ క్రమంలో శుక్రవారం కోళ్ల ఫారం సెంటర్లో ఆ ప్రాంతవాసులు సాంప్రదాయబద్ధంగా భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం నేదురుమల్లి నివాస�