డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ :డక్కిలి మండలంలోని లింగసముద్రం గ్రామపంచాయతీ కుక్క చాకలపల్లి అరుంధతి వాడికి చెందిన సుమారు 70 కుటుంబాలలో 50 కుటుంబాల వారు శుక్రవారం వెంకటగిరిలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి సమక్షంలో వైకాపా కండువా కప్పుకున్నారు. వైకాపాలోనే దళితులకు అభివృద్ధి భవిష్యత్ రాజకీయ అవకాశాలు తెలుగుదేశం పార్టీలో కంటే మెండుగాఉంటాయని వారు మాట్లాడారు. ఈ సందర్భంగా రాంకుమార్ రెడ్డి మాట్లాడుతూ వచ్చిన వారికి సాదారంగా ఆహ్వానం పలికారు మీకు నేను అండగా ఉంటానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జగనన్న ప్రభుత్వంలోనే అన్ని వర్గా ప్రజలకు ఆర్థిక అభివృద్ధి, సంక్షేమం, పదవులు అవకాశాలు ఉంటాయన్నారు. వైకాపా విధానాలు జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందన్న నమ్మకంతోనే ప్రజలు, ఇతర పార్టీలకు చెందిన వారు వైకాపాలోకి రావడానికి కారణం అన్నారు. నాయకులు, కార్యకర్తలు నేను సైతం ప్రతి ఒక్కరం ఈ రెండు నెలల్లో పార్టీ కోసం గట్టిగా పనిచేయాలని సార్వత్రిక ఎన్నికలలో వైకాపా గెలుపు లక్ష్యంగా అందరం సమిష్టిగా పని చేద్దామన్నారు. ఎవరు అధైర్యపడవద్దని ప్రతి ఒక్కరి సేవలకు నేను వారి రుణం తీర్చుకుంటానన్నారు. లింగసముద్రం గ్రామ పంచాయతీవైకాపా నాయకులు, డక్కిలి మండల నాయకులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కుక్క చాకలి పల్లి అరుంధతి వాడికి చెందిన వైకాపాలు చేరిన వారు రాంబాబు, వెంకటేశ్వర్లు,జయ,బాలకృష్ణయ్య,రవి,వెంకటయ్య,పుల్లయ్య,పెంచలయ్య,సుబ్బరామయ్య, వెంకట రమణయ్య, సురేష్, చిన్నబ్బయ్య, సీనయ్య, యోగేశ్వరరావు, శివశంకర్ తదితరులు ఉన్నారు, అదేవిధంగా డక్కిలి జేసిఎస్ మండల ఇన్చార్జి చింతల శ్రీనివాస్ రెడ్డి, మాధవ్ నాయుడు, యువజన విభాగం నాయకులు మోహన్,పరంధామయ్య, గోవర్ధన్ నాయుడు, ప్రకాశం నాయుడు, ఘట్టమనేని శ్రీనివాసులు నాయుడు, ఎమ్మెల్ నారాయణరెడ్డి, రమేష్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, త్వరలో టిడిపి నుండి మరికొందరు వైకాపాలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వారు మాట్లాడారు.