చివరి నిమిషంలో దెబ్బేసేశారు..
I మా అమ్మాయి ఎన్నికల ప్రచారానికి స్వాగతిస్తున్నాం.. రండి!
I వెంకటగిరి టీడీపీ నాయకుడు కురుగొండ్ల రామక్రిష్ణ
(వెంకటగిరి` వెంకటగిరి పక్స్‌ప్రెస్)
మస్తానూ.. నేను కూడా టిక్కెట్ కోసం చివరివరకు కొందరిని నమ్మిమోసపోయానని మాజీ ఎమ్మెల్యే, వెంకటగిరి టిడిపి నాయకుడు కురుగొండ్ల రామక్రిష్ణ బుధవారం నాడు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ యాదవ్ ముందు తన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. మస్తాన్ యాదవ్ ఛారిటబుల్ ట్రస్ట్ కార్యాలయానికి ఆకస్మికంగా గురువారం ఉదయం చేరుకున్న కురుగొండ్ల రామక్రిష్ణ అక్కడ కార్యకర్తలతో మాట్లాడుతున్న మస్తాన్ యాదవ్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయాలకే పూర్తి జీవితాన్ని కేటాయించి రేయింబవళ్ళు పనిచేస్తుంటే తనకు కూడా టిక్కెట్ రాకుండా కొందరు అడ్డుకోవడం చాలా బాధకలిగించిందని, తను కూడా మోసపోయానని కురుగొండ్ల ఆవేదన్య వక్తం చేశారని తెలిసింది.