డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ : డక్కిలి మండలం కేబి. పల్లి గ్రామం పేద దళిత కుటుంబానికి చెందిన చిగురుపాటి కిరణ్ వెంకటగిరి నియోజకవర్గ తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డాడు. ఇతను
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేశాడు. గతంలో జగన్ ఫ్లెక్సీలు, ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులు అక్రమాలు ఎస్సీ కార్పొరేషన్ నిధులు రద్దు ఆందోళన తదితర ఆందోళనలో ఇతనపై కేసులు నమోదయి ఉన్నాయి. విద్యార్థి దశ నుంచి తిరుపతి జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గంలో యువతను ప్రోత్సహిస్తూ ఎన్నో అక్రమ అరెస్టులను అవమానాలను ఎదుర్కొన్నానని, నన్ను గుర్తించి నాకు ప్రొఫెషనల్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షులుగా నర్రావుల. వంశీకృష్ణ కు బాధ్యతలు అప్పజెప్పిన తెలుగుదేశం జాతియఅధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి కురుగొండ్ల లక్ష్మీ సాయి ప్రసన్న, కురుగొండ్ల రామకృష్ణ ధన్యవాదాలు తెలియజేశారు.