– మండలాల్లోని టీడీపీ నేతలతో కురుగొండ్ల రామక్రిష్ణ, గంగాప్రసాద్ల మంతనాలు
( వెంకటగిరి` వెంకటగిరి పక్స్‌ప్రెస్)
తండ్రి కురుగొండ్ల రామక్రిష్ణ రాజకీయ శైలికి భిన్నంగా గెలుపే ధ్యేయంగా వ్యూహరచనలో వెంకటగిరి టిడిపి అభ్యర్థి కురుగొండ్ల లక్ష్మీసాయి నిమగ్నమైనట్లు తెలిసింది. పార్టీ నిర్వహణ, నాయకులు అనుచరులతో కలిసి చేసే ప్రయాణం తనదైన శైలిలో వుండేలా ముందుగా ప్రచార వ్యూహంతో ఉన్నట్లు తెలియవచ్చింది. దీనికి ఆమెకు మామ కొండెపాటి గంగాప్రసాద్ వ్యూహరచనలు కూడా తోడవుతున్నట్లు తెలిసింది. త్వరలోనే మంచి రోజు చూసుకుని ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టనున్నట్లు సమాచారం. దీనికోసం పార్టీ కార్యాలయ సిబ్బంది రూట్‌మ్యాప్‌లు కూడా సిద్దం చేసినట్లు తెలియవచ్చింది.