వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్… గత మూడు సంవత్సరాల నుండి వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో సుమారు 70 లక్షల రూపాయల నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణ జరిపించాలని ఆరవ వార్డు కౌన్సిలర్ మాడ జానకిరామయ్య బడ్జెట్ సమావేశంలో ఇక్కడ పనిచేసే వెళ్లిపోయిన కమిషనర్ వెంకటరామయ్య అనేక అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయని విజిలెన్స్ విచారణ జరిపిస్తేనే ఇవన్నీ తేలుతాయని అప్పుడే బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని లేకపోతే కౌన్సిల్ సమావేశాలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు 25 మంది కౌన్సిల్ సభ్యులు ఏకతాటిపై నిలిచి విచారణ జరిపించాలని మున్సిపల్ చైర్మన్ వినతి పత్రం అందించారు దీనికి స్పందించిన మున్సిపల్ చైర్మన్ నక్కా భానుప్రియ మాట్లాడుతూ అవినీతికి పాల్పడి ఉంటే కచ్చితంగా విచారణ జరిపించి తీరుతామని హామీ ఇచ్చారు నాలుగో వార్డ్ కౌన్సిలర్ ఎంఏ నారాయణ మాట్లాడుతూ వాస్తవానికి దూరంగా మున్సిపల్ బడ్జెట్ ఉన్నట్లు పేర్కొన్నారు