వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
వెంకటగిరి రూరల్ మండలంలో వల్లివేడు గ్రామ పంచాయతీకి విచ్చేసిన ఆంధ్ర రాష్ట్ర మాజీ మంత్రివర్యులు గౌరవ శ్రీ రాజలక్ష్మిమ్మ వల్లివేడు ప్రజలు ఆప్యాయతగా పలకరించారు. అనంతరం ఆమె వల్లివేడు ప్రజలతో మాట్లాడుతూ వల్లివేడు ప్రజలు నేదురుమల్లి కుటుంబాన్ని మీ కుటుంబంలో ఒకరిగా చూసినారని చెప్పినారు. కానీ రాజకీయంగా మన మధ్య కొంచెం గ్యాప్ వచ్చిన వెంకటగిరి ప్రజలను చూసుకోవడానికి నేదురుమల్లి కుటుంబం ఎప్పుడు ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటామని చెప్పినారు. అనంతరం గ్రామంలో కాసరం వీరస్వామి చనిపోయారని తెలుసుకుని వారింటికి వెళ్లి వారి సతీమణిని పరామర్శించి వారి యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు, జడపల్లి శీనయ్య కిడ్నీ వ్యాధితో మరణించారని తెలుసుకొని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు, బర్రి శ్రీనివాసులు రెడ్డి బాలరాజు కన్నులు కనిపించడం లేదని బాధపడుతున్నారు అని తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారిని వారి కుటుంబాన్ని ఓదార్చించినారు, హరిజవాడ లో పంజం ప్రసాద్ దట్టం సుబ్రమణ్యం , కల్లూరు బాబు కిడ్నీ వ్యాధులతో మరణించిన తెలుసుకొని వారందరి ఇల్లులకి వెళ్లి వారి కుటుంబ సభ్యులందరినీ పరామర్శింన్నారు, ST కాలనీ లో ఈగ రత్నయ్య మరణించినారని తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యుల పరామర్శించారు, బుసపాలెం లో బ్రహ్మయ్యను,హరిజవాడలో గోదాటి నాగూరమును కలిసి వారి యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బుసపాలెం sc కాలనీ చెందిన తట్టు సుబ్బారావు గారు కిడ్నీ వ్యాధితో మరణించినారు అని తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించినారు.