బాలాయపల్లి -వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని వెంకటగిరి సీఐ సంగమేశ్వర రావు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని జయంపు, గొట్టికాడు, బాలాయ పల్లి గ్రామాలలో స్థానిక ఎస్సై మహబూబ్ సుభాన్ ఆధ్వర్యంలో కేంద్ర పోలీస్ బలగాలు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇటువంటి అవంతరాలు లేకుండా ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో కొత్తవారు తిరుగుతున్న వారిపై ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కోరారు. బాలాయపల్లి మండలంలో ఎన్ని పోలింగ్ బూతులు ఉన్నాయో ప్రతి పోలింగ్ బూత్‌లను పరిశీలించి వాటికి కావలసిన వసతులు వెంటనే ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఆదేశించారు.సమస్యత్నక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఎస్సైకి ప్రత్యేకంగా ఆదేశించారు.ఈకార్యక్రమంలో కేంద్ర పోలీసు బలగాలు తదితరులు పాల్గొన్నారు.
పోటో:-కవాతు చేస్తున్న కేంద్ర పోలీస్ బలగాలు