డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ :వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను డక్కిలి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు ఆ పార్టీ నాయకులు. ఈ సందర్భముగా వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలు వేసి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. జె ఎస్ సి మండల ఇన్చార్జి చింతల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి తన వైకాపాను పేదల కోసం స్థాపించారని వారి అభివృద్ధి సంక్షేమం గ్రామ పాలనకు పెద్దపీట వేస్తున్నారన్నారు. ఎవరు ఎన్ని కూటములు కట్టిన పేద వర్గాల కూటమి జగన్ వైపే ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెలకంటి చెంచయ్య, వైకాపా మండల ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి,దువ్వూరు రవీంద్ర రెడ్డి, ఎమ్మెల్ నారాయణరెడ్డి, దాసరి పోలయ్య, రాపూరు చిరంజీవి,ఘట్టమనేని శ్రీనివాస్ నాయుడు, నావురు కోటేశ్వరరావు, శ్రీహరి రెడ్డి, కోళ్లపూడి వేణుగోపాల్ ,భాస్కర్ నాయుడు, రమణారెడ్డి, ప్రభాకర్ బాబు, సర్వేపల్లి రత్నయ్య, గోవర్ధన్ నాయుడు,మామిడి శ్రీనివాసులు,తోట శంకర్ రెడ్డి,పాపయ్య,పొదిలి రమణయ్య మరియు సోషల్ మీడియా ప్రతినిధి పచ్చురు. రమేష్ తదితరులు పాల్గొన్నారు.