బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
ఎన్నికలు సమీపిస్తున్నాయి ప్రతి ఒక్క కార్యకర్త సైనికులాగా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ వెందోటి కార్తీక్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పార్టీ ఆవిరిభవ దినోత్సవం జరిగింది.ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ మారుముల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త యుద్ధంలో సైన్యాకుడు ఎలా యుద్ధం చేస్తాడో అలా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు.వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ని అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
ప్రతి కుటుంబాన్ని సంక్షేమ పథకాలతో ఈ ఐదేళ్లలో మనం పలకరించాం ధైర్యంగా వెళ్లి ఓట్లుఅడుగుదామన్నారు.
సంక్షేమ పథకాలే విజయం బాట :-
మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేడు మనకు విజయానికి బాట అని జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కాటూరు తులసి రెడ్డి పేర్కొన్నారు. పని చేద్దాం గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ రమేష్ నాయుడు,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రం రామ్మూర్తి యాదవ్, బాలాయపల్లి సహకార సంఘం అధ్యక్షుడు పల్లం టి.రాంబాబు నాయుడు, గోపాల్ యాదవ్, కాటూరు ప్రసాద్ రెడ్డి,కోటంబేడు. వెంకటర మణారెడ్డి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో :- పూలమాల వేస్తున్న దృశ్యం