సైదాపురం, వెంకటగిరి అసెంబ్లీ ఎక్స్ ప్రెస్ 12:
రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ని అధిక ఓట్ల మెజారిటీ తో గెలిపించి ముఖ్య మంత్రిగా జగన్మోహన్ రెడ్డి ని చేయాలని మండల వైసీపీ కన్వీనర్ మన్నారపు రవికుమార్ యాదవ్ అన్నారు. చాగణం గ్రామంలో నిర్వహించిన 4వ విడత వైస్ఆర్ చేయూత పథకం కార్యక్రమం లో 2,902 మంది లబ్ది దారులకు రూ.5, 44, 13,000 ల చెక్కును వైసీపీ మండల నాయకుల చేతుల మీదుగా పంపిణి చేశారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడు తూ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి తో అభివృద్ధి సాధ్యం అన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి రావాలన్నారు. కార్యక్రమం లో ఎంపిడివో సుధాకర్, ఏవో పురుషోత్తం శివ కుమార్, ఏపీఎం రాధ, సొసైటీ అధ్యక్షుడు శివకుమార్, నాయకులు ప్రభాకర్ రెడ్డి, రాంగోపాల్ రెడ్డి, చంద్రా రెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, దయాకర్ రెడ్డి తరులు పాల్గొన్నారు.