బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
పెళ్లకూరు చాగణం లలితమ్మ భాస్కరరావు మెమో రియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఉచి త కంటి వైద్య శిబిరానికి విషేస్పందన లభించింది.
ఇ శిబిరానికి తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రలయం వారి సహకారంతో బాలాయపల్లి మండలం కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పా టు చేశారు.ఈసందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ చాగణం గౌరిశంకర్, సీఈవో సీతారామ్ నాయుడు మాట్లాడుతూ కంటి ఆరోగ్య సమస్యలకు సీనియర్ వైద్య నిపుణులైన అను భవం గల స్పెషలిస్ట్ డాక్టర్ల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలు, తగు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది అన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరం లో 200 మంది కి పరీక్షలను నిర్వహంచారు 70 మంది కి ఉచితముగా మందులు పంపిణీ 60 రోగులకు ఉచిత కంటి అద్దాలు, 40 మంది కి ఉచితంగా ఆపరేషన్ లు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఏఓ కృష్ణ గల్లా, అరవింద్ నేత్ర లయ సిబ్బంది జీవన్ , తదితరులు పాల్గొన్నారు.
పోటో:-పరీక్షలు చేస్తున్న దృశ్యం