బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
మహాశివరాత్రి సందర్భంగా పోటెత్తిన భక్తులు. ప్రత్యేక పూజలు శివలింగాలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు మండలంలోని సుబ్రమణ్యం గ్రామం, కనుమురాయుడు కొండపై వెలసి ఉన్న శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో భక్తులు బారులు తీరారు.శివనామస్మరణతో ఆలయాలు మార్మో గాయి.ఇక మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేల మంది భక్తులు తరలివచ్చారు. శివరాత్రి వేడుకలు నేత్రపర్వంగా సాగాయి. ఉదయం చండీ శ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివ పంచాక్షరీ జపానుష్టానాలు రుద్రపారాయణలు, రుద్రహోమం, చండీహోమాలు నిర్వహించినట్లు దేవస్థానం ఈవో లవన్న తెలిపారు.సాయంత్రం ప్రత్యేకంగా అక్కమహాదేవి అలంకార మండపంలో చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత మంగళ వాయిదాల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు నీరాజనం పట్టారు. శోభాయాత్రలో , గొరవనృత్యం, నందికోలసేవ తదితర విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
కాళరాత్రి పూజ :-
ఉత్సవం అనంతరం కాళరాత్రి పూజ, మంత్ర పుష్పంతో పాటు ఆస్థాన సేవ నిర్వహించారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ వెందోటి.కార్తిక్ రెడ్డి శివరాత్రి సందర్భంగా సుబ్రహ్మణ్యం గ్రామంలో వెలసిన షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజ నిర్వహించి దర్శించుకున్నారు. ఆయన వెంట వెందోటి. హరికృష్ణ రెడ్డి, మల్లేల. వెంకటేశ్వర్లు,సర్వేపల్లి సురేష్, నాయకులు తదితరులు ఉన్నారు.
పోటో:-పూజలో పాల్గొన్న నాయకులు
ఫోటో:- విద్యుత్ అలంకరణ