డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ :డక్కిలి మండలం లింగసముద్రం సెగ్మెంట్ వైకాపా ఎంపీటీసీ నావురు కోటేశ్వరరావు టిడిపిలోకి వెళుతున్నట్లుగా జరిగిన ప్రచారం అవాస్తమని. నేను పార్టీ మారుతున్నట్లు ఓ పత్రికలు వచ్చిన వార్త కథనాన్ని ప్రెస్ మీట్ లో ఖండించారు. ఈ సందర్భంగా ఎంపిటిసి కోటేశ్వరరావు మాట్లాడుతూ వైకాపా లోనే నాకు గౌరవం అని, విద్యావంతుడైన నన్ను ఎంపీటీసీగా అవకాశం ఇచ్చినటువంటి పార్టీ వైకాపా పార్టీ అని జగన్మోహన్ రెడ్డి పాలనలోనే పేద ప్రజలు ఆనందంగా ఉంటారని తిరిగి జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలన్న లక్ష్యంతో నేను పని చేస్తానన్నారు. తెలుగుదేశం పార్టీలోకి ఎట్టి పరిస్థితుల్లో నేను వెళ్ళను అన్నారు.