వెంకటగిరి.. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
గిరిజనుల సమస్యలు పరిష్కారం కోరుతూ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
ధర్నానుద్దేశించి రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వివి రమణయ్య మాట్లాడుతూ వెంకటగిరి ఏరియాలో ఉన్న వెలుగొండ అటవీప్రాంతాన్ని ఆనుకొని గిరిజనులు (యానాదులు) పెద్ద సంఖ్యలో జీవనం సాగిస్తున్నారన్నారు. వీరికి సంవత్సరంలో రెండు నెలలు మాత్రమే వ్యవసాయ కూలీ పనులు ఉంటాయని ఉపాధి హామీ పనులు కూడా కుటుంబం అంతా పనిచేస్తే 100 పని దినాలు ఒక నెలలోనే అయిపోతాయని మిగిలిన రోజులంతా వీరు అడవిపై ఆధారపడాల్సిందేనన్నారు. అడవి నుంచి చిన్న తరహా ఉత్పత్తులైన జిగురు, మారేడు గడ్డలు, తేనె,ముష్టిగింజలు, చిల్లగింజలు, ఉసిరి,కరగకాయలు తెచ్చుకుని జిసిసి స్టోర్లోనూ, బయట మార్కెట్లోను అమ్ముకుని బతికేవారు. కొన్ని గ్రామాల్లో చీపురులకు వాడే కొండఈతాకు, పూల మాలలకు వాడే మునుకుడాకు తెచ్చుకొని అమ్ముతూ కుటుంబాలు పోషించుకునేవారు. గత మూడేళ్లుగా అటవీ శాఖ సిబ్బంది అడవిలోనికెళ్లనీకుండా వీరిని అడ్డుకోవడంతో బ్రతుకు దెరువులేక చెన్నై వంటి దూర ప్రాంతాలకు తోటల్లో పనిచేసే కూలీలుగా వలస వెళ్లాల్సి వస్తోంది. గిరిజనులు సాగు చేసుకునే అటవీ పోరంబోకు భూములకు కూడా రకరకాల కొర్రీలు పెట్టి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. చివరకు ఈ భూముల్లో సాగు చేయనీయకుండా కూడా అడ్డగిస్తున్నారు. గిరిజనులు అడవిపై ఆధారపడి జీవనం సాగించడానికి వీరి హక్కులను గుర్తిస్తున్నామంటూ తెచ్చిన అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006 ఆచరణలో నిరుపయోగంగా మారుతోందన్నారు.అంతేగాక ఎస్టీలు నివసిస్తున్న గ్రామాలకు ఆనుకుని వున్న ఫారెస్ట్ భూములు నిరుపయోగంగా