డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ :వెంకటగిరి నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అమ్మ మాజీ మంత్రి రాజ్యలక్ష్మిమ్మ డక్కిలి మండలంలో సోమవారం సాయంత్రం సంగనపల్లి, బ్రాహ్మణపల్లి, కమ్మపల్లి గిరిజన కాలనీ, అంబేద్కర్ నగర్, అరుంధతి వాడ, వెంకటేశ్వరపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రయాణంలో తనతో కలిసి పనిచేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను కలుసుకొని వారి బాధలను, ఆనందాలను అనుబంధాలను నెమరు వేసుకుని ప్రతి ఒక్కరిని రాజ్యలక్ష్మిమ్మ ఆత్మీయంగా పలకరించారు. దీనితో గ్రామాలు వాడలలో ప్రజలలో ఒక ప్రత్యేకమైన ఆనందం సంబరాలు కనబడుతున్నాయి, నేదురు మల్లి జనార్దన్ రెడ్డిని, తనను ఆదరించిన ప్రజలు తన కుమారుడైన రామ్ కుమార్ రెడ్డి ఈ ఎన్నికలలో ఇక్కడి నుండి పోటీ చేస్తున్నాడని మీ మద్దతు మీ ఓటు నా కుమారుడికి వేయండిని అందుకు మీకు సేవ చేసే భాగ్యం, ఈ ప్రాంత అభివృద్ధి కి నిజాయితీగా పనిచేస్తాడు అన్నారు. గ్రామాలలో సైతం ప్రజలలో నేదురు మల్లి రామ్ కుమార్ రెడ్డి అవసరాన్ని గుర్తించి మా మద్దతు రామన్నకే అంటున్న జనం స్పందన చూసి రాజ్యలక్ష్మిమ్మ సంతోషించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట చింతల శ్రీనివాసులు రెడ్డి, శ్రీహరికోట కృష్ణయ్య,మాజీ ఎంపీపీ వెలికింటి చెంచయ్య, నర్రావుల వేణుగోపాల్ నాయుడు, పెట్లూరు జగన్మోహన్ రెడ్డి,కోళ్లపూడి వేణుగోపాల్,భాస్కర్ నాయుడు,ఎమ్మెల్ నారాయణరెడ్డి,ఘట్టమని శ్రీనివాసులు నాయుడు,రాపూరు చిరంజీవి, మాజీ ఎంపిటిసి గురవయ్య, మాజీ సంగనపల్లి సర్పంచ్ జానకిరామ్,జడపల్లి శ్రీనివాసులు, కొమ్మినేని కోటేశ్వరరావు మరియు వెంకటగిరి నియోజకవర్గ సోషల్ మీడియా కో కన్వీనర్ పచ్చురు. రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.