డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ : బహుజన సమాజ్ పార్టీ వెంకటగిరి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాల జయ చంద్ర కందుల వారి పల్లి, నాగోలు, పలుగోడు, నాగలపాడు, చాపలపల్లి గ్రామాలలో తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అట్టడుగు వర్గాలు 85% గా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అధికారంలోకి రావాలంటే బహుజన సమాజ్ పార్టీ గుర్తు ఏనుగు గుర్తుకు ఓటేయాలని , ఆత్మగౌరవం అభివృద్ధి అధికారం అనేది బి ఎస్ పి తో సాధ్యమన్నారు. నూటికి 85% గా ఉన్న ప్రజల ఓట్లు మనవి 15% ఉన్న అగ్రకులాలకు పదవులు అధికారాలని, మన ఓట్లను మనవారికి వేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జి జోరేపల్లి వెంకటేశ్వర్లు, మండల కమిటీ నాయకులు కలపాటి పెంచలయ్య, నరికేమని, నిమ్మల అంకయ్య, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.