డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ :డక్కిలి మండలంలో ఐదు సంవత్సరాలు లోపు పిల్లలకు 98.5% పోలియో చుక్కలను వేయడం జరిగిందని డాక్టర్ బిందు ప్రియాంక తెలిపారు. మండలంలో 4445 పిల్లలకు గాను ఆదివారం 4375 మంది 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలీసులకు వేయడం జరిగిందని, మిగిలిన చిన్న పిల్లలకు సోమ మంగళవారాలు వారి ఇండ్ల వద్దకు వెళ్లి పోలియో చుక్కలను వేయటం జరుగుతుందని డాక్టర్ బిందు ప్రియాంక తెలిపారు. మండలంలోని అన్ని సచివాలయ కేంద్రాలు, గ్రామపంచాయతీలు, ప్రధాన కూడళ్లునందు పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్యులు,సూపర్వైజర్లు, ఏఎన్ఎమ్ లు, ఆశ వర్కులు, హెల్త్ అసిస్టెంట్లు, అంగన్వాడి సిబ్బందిపాల్గొన్నారు. అదేవిధంగా డక్కిలి సబ్ ఇన్స్పెక్టర్ చౌడయ్య, డిప్యూటీ తాహిసిల్దార్ హరికృష్ణ, ఎంఈఓ 2 జగదీష్ బాబు, రెవిన్యూ ఇన్స్పెక్టర్ రాజేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.