బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
3450 మంది చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయడం జరిగిందని స్థానిక వైద్యా ధికారిని ప్రమీల పేర్కొన్నారు. ఆదివారం పల్స్ పోలియో చుక్కలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ మండల ములో 54 పల్స్ పోలియో కేంద్రాలు, మండల కేంద్రంలో ఉన్న ఆర్టీసీ బస్టాండు,వెండోడు రైల్వే స్టేషన్, రెండు మొబైల్ కేంద్రాలలో 3500 మంది చిన్నారులకు గాను 3450 మంది చిన్నారులకు పల్స్ పోలే చుక్కలు వేయడం జరిగిందన్నారు.
మిగతా వారికి సోమ, మంగళవారం ప్రతి ఇంటిని సందర్శించి పల్స్ పోలియో చుక్కలు వేసుకుని వారిని గుర్తించి వారికి పలసపోయే చుక్కలు వేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్ర మంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫోటో:- పోలియో చుక్కలు వేస్తున్న వైద్యధికారిణి