అవినీతిపరుడు అందలం ఎక్కి ఆంధ్రప్రదేశ్ ని పాతాలానికి తొక్కుతూ ప్రజలను ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్న కురుగొండ్ల.
విధ్వంసాలతో పరిపాలన మొదలు పెట్టిన జగన్ మోహన్ రెడ్డికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారని తెలిపారు.సిద్ధం సభ అంతా భ్రమ, నారా చంద్రబాబు నాయుడు గారిపై అసత్య ఆరోపణలు.
సభ ప్రారంభంలోనే ప్రజలు విసిగి వెనుతిరగటాన్ని చిత్రీకరిస్తున్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు.
తే.19.02.2024దిన వెంకటగిరి పట్టణము నందు క్రాస్ రోడ్డు వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహమునకు పూలమాల వేసి, దాడిని ఖండిస్తూ మాట్లాడుతూ నిన్న అనంతపురం జిల్లా, రాప్తాడులో సీఎం సిద్ధం సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అద్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తగవని జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు చేసింది ఏమీ లేదు అని ఊరికే అసత్యాలు చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేయటం తప్పా అభివృద్ధి చేసింది ఏమి లేదు అని పేర్కొన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై భహిరంగ చర్చకు పిలిస్తే ఇంతవరకు దానిపై ఎలాంటి సమాధానం లేదు అని దీన్ని పట్టి ప్రజలకు కూడా అర్థమవుతుందని అన్నారు, విధ్వంసాలతో పరిపాలన మొదలు పెట్టిన జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి ఏం చేస్తారో చెప్పాలని జగన్ అండ్ కో రాష్ట్రాన్ని మొత్తం దోచేస్తున్నారనితెలిపారు, సభ ప్రారంభంలోనే ప్రజలు విసిగి వెనుతిరగటాన్ని చిత్రీకరిస్తున్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడితే అక్కడే వున్న పోలీసులు పట్టించుకోకుండా ప్రేక్షక పాత్ర పోషించటం, దానిపైన కూడా ఇంతవరకు స్పందించకపోవడం, సామాన్యులకు ఈ ప్రభుత్వంలో స్వాతంత్య్రం లేదు అనే విధంగా వీరి తీరు వుంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ, డక్కిలి మండల అధ్యక్షులు, పార్లమెంట్ కమిటీ సభ్యులు, రాష్ట్ర అనుబంధ, నియోజకవర్గ అనుబంధ కమిటీ, పట్టణ, మండలాల కమిటీ సభ్యులు, యువత, ఐటీడీపీ,TNSF నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.*