బస్సులు రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు
రాత్రి 6 గంటల వరకు వేచిఉన్న విద్యార్థులు
ఆందోళనలో తల్లిదండ్రులు
బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
4 గంటలకు వచ్చే బస్సు రాక పోవడంతో విద్యా ర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా సంఘటన శనివారం మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థులు చోటు చేసుకుంది. వెంకటగిరి ఆర్టీసీ డిపో నుంచి వచ్చే ఆర్టీసీ బస్సు లు సకాలంలో రాక పోవడంతో విద్యార్థులు ఇళ్ళకు ఎడుగంటలకు చేరుకొని పోవడం తల్లిదం డ్రులు ఆందోళనకు గురిఅయినారు.సాయంత్రం 4:45 గంటలకు పాఠశాల వదిలి పెట్టిన దగ్గర నుంచి రాత్రి ఆరు గంటల వరకు బస్సు కోసం ఎదురు చూశారు.గూడూరు రూరల్ మండలం తిప్పావారుపాడు,కందలి,చెమిర్తి,తిరువేళయపల్లి గొల్లపల్లి,నెర్ణురూ,వెంకటరెడ్డిపల్లి,నిండలి,అంబలపూడి,అలిమిలి.కుందకూరు గ్రామాలకు చెందిన తమ పిల్లలు రాత్రి 8 గంటలైనా ఇంటికి రాలేదని కంగారు పడిన తల్లిదండ్రులకు పాఠశాల ఉపాధ్యా యులకు పోన్లు ద్వారా విషయం తెలిసుకోని విద్యార్థుల కోసం రెండు ఆటోలు, వేముల బండ వైపు వెళ్లేవారిని వ్యాన్లోకి ఎక్కించి వారి తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. పాఠశాల మండల కేంద్రానికి కిలో మీటరు పైగా ఉండటం, ఊరికి చివరిగా ఉండటంతో విద్యార్థులు రెండు గంటలకు పైగా పాఠశాల ఎదురుగా బిక్కుబిక్కు మంటూ నిరీక్షించారు. తల్లిదండ్రులు ఆందోళనకు గురైనారు
పోటో:-బస్సు కోసం పడిగాపులు
పోటో:-బస్సు కోసం నిరిక్షణ చేస్తున్న విద్యార్థులు