.వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
వెంకటగిరి లోని నేడురుమల్లి నివాసంలో N. J. R భవనంలో డక్కిలి మండల వాలంటరీలకు *వాలంటీర్ల వందన0కార్యక్రమమును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నా… ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త గౌరవ శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి . ఈ కార్యక్రమంలో వాలంటీర్లను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ వాలంటీర్లు యొక్క పనితీరు అభినందనీయమని అందుకని మీ వాలంటీర్లు అందరికీ మొదటగా సెల్యూట్ చేస్తున్నానని చెప్పినారు. అవినీతి లేకుండా, ఎటువంటి వివేక్ష లేకుండా పారదర్శకంగా ప్రజల వద్దకే పాలను తీసుకొని వెళ్లాలని ఉద్దేశంతోనే ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చారని వివరించినారు.అందుకనే వాలంటీర్లను జగనన్న సైనికులు అంటారని చెప్పినారు. వాలంటరీ వ్యవస్థ వచ్చిన దగ్గర నుండి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ఏ పథకమైన గాని ప్రజల వద్దకు చేరుతుందని వివరించినారు. ఇందుకోసమే వాళ్ళ సేవలను గుర్తించిన జగన్మోహన్ రెడ్డి వారిని సత్కరించాలని వాలంటీర్ల వందనం కార్యక్రమమును ఏర్పాటుచేసి సేవాnj మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాలతో సత్కరించమని చెప్పారని చెప్పినారు… అనంతరం వాలంటరీ అందరికీ శాలువా కప్పి అభినందించినారు..