వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్.. .వెంకటగిరి నియోజకవర్గ అసెంబ్లీ టికెట్లు బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలని ఇక్కడ బీసీ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్నందువలన వారికే రెండు పార్టీలు టికెట్లు ఇచ్చి బీసీలకు రాజ్యాధికారం రుచి చూపించాలని బిసి నాయకులు డిమాండ్ చేశారు పట్టణంలో స్థానిక ఏవిఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చినప్పుడు నుండి నేటి వరకు చాలా బీసీ కులాలు కనీసం అసెంబ్లీ గేటు కూడా తాక లేదని దీనికి కారణం ఆర్థిక అసమానతలేనని ఆర్థిక అసలా కారణంగా చూపించి రాజకీయ పార్టీలు బిసి లకు టికెట్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాయని ఇదే పద్ధతి కొనసాగితే ప్రతి బీసీ కాలనీకి ఎస్సీ ఎస్టీ కాలనీలకు మైనారిటీ కాలనీలకు వెళ్లి ప్రజలను చైతన్య వందలు చేసి ఓసి నాయకులకు ఒకటి ఓటు కూడా పడకుండా చేస్తామని కావున రాజకీయ పార్టీలు తిరిగి ఆత్యధికంగా పద్మశాలి యాదవ ఇతర బీసీ కులాలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని బీసీలకే రెండు పార్టీలు కేటాయించాలని హెచ్చరించారు ఇది విన్నపము హెచ్చరిక ఏదైనా పర్వాలేదని గత తెలుగుదేశం ప్రభుత్వం సాధికారిక సర్వే పేరుతో సర్వేలు నిర్వహించి నేటి వరకు వాటిని బయట పెట్టలేదని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కొత్తగా కుల గణన తీసుకొచ్చి బీసీలను ఏమీ ఉద్ధరిస్తారని తెలిపారు కావున రాజకీయ పార్టీలు నాయకులు కేవలం బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూడకుండా గెలిచే ప్రాంతాల్లో వారికి టికెట్లు ఇచ్చి వారిని గెలిపించడానికి కృషి చేయాలని లేకపోతే బీసీలు ఏకమై వారి సత్తా ఏదో ప్రతి నియోజకవర్గంలో చూపిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిసి నాయకులు స్థానిక నేతలు పాల్గొన్నారు