వెంకటగిరి.. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
వెంకటగిరి నియోజకవర్గం నందు వెంకటగిరి వాసి అయినటువంటి శ్రీ కె.జె ప్రకృతి కుమార్ అనేక సేవా కార్యక్రమాలు వెంకటగిరి నందు స్వామి వివేకానంద యువ సైన్యం ఆధ్వర్యంలో 777 కి పైగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఆయనకు అరుదైన గౌరవం వెంకటగిరి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు నందు ఇంచార్జ్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమితులయ్యారు ఆయనకు పిడబ్ల్యు ఫెడరేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సన్మానించడం జరిగింది ఆయన మాట్లాడుతూ పిడబ్ల్యూ ఫెడరేషన్ దివ్యాంగు సోదరులందరికీ నాయొక్క సలహాలు సూచనలు ఇంకా అనేకమైన అంశాలు మీ అందరికీ అందుబాటులో ఉంటానని దివ్యాంగుల పట్ల అనేకమైన ప్రేమ భావాలు తనకు ఉన్నాయని మీ అందరితో నేను మమేకమై అమూల్యమైన అంశాలను మీకు తెలియపరుస్తూ మీ వెన్న అంటూ ఉంటానని దివ్యాంగులకు భరోసా ఇచ్చారు ఫెడరేషన్ లో మీరందరూ కలిసి గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ప్రతి ఒక్క దివ్యంగుని అభినందించారు అంతేకాకుండా మీ చట్టాలను మీకు వివరిస్తూ మీకు ప్రత్యేకమైన మీ చట్టాలను ముద్రించి దివ్యంగుల సోదరులందరికీ అందిస్తానని తెలియజేస్తూ దివ్యాంగులందరినీ అభినందించారు ఈ కార్యక్రమం పిడబ్ల్యు ఫెడరేషన్ కోశాధికారి అయినటువంటి బి రాజా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జిల్లా అధ్యక్షులు మురళి గౌడ్ ,వెంకటగిరి అధ్యక్షులు గుర్రాల రమేష్, ఉపాధ్యక్షులు తుపాకుల మురళి, సెక్రటరీ మాధవ్ వీరభద్రయ్య మరియు హరి, శ్రీను, రజిని, సుబ్బయ్య సభ్యులందరూ పాల్గొన్నారు