బాలాయపల్లి -వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
నులుపురుగులు విద్యార్థులపై ప్రభావం చూపి చదువుపై ఆసక్తి చూపలేకుండ పోతున్నారని సిడిపీఓ సంషాద్ బేగం పేర్కొన్నారు. శుక్రవారం
అంగన్వాడీ సూపర్ వైజర్ రాజేశ్వరి ఆధ్వర్యంలో
మండలంలోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశా లలు,కళాశాలలో 1 నుంచి 19 ఏళ్ల లోపు విద్యార్థులకు అల్బెండ్జోల్ మాత్రలు మింగించే కార్యక్రమం నిర్వహించారు.ఈసందర్భంగా ఆమే మాట్లాడుతూ. నులి పురుగులనేవి పేగుల నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందే పరాన్న జివులు ఈ వ్యాధి కారకాన్ని అస్కారియాసిస్ అంటారు , ఇవి పేగుల్లో నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందే పరాన్న జీవుల ఇవి నెలల్లో గుడ్లు, లార్వాలుగా వృద్ది చెందుతాయి. వీటి ద్వారా శరీరంలో రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి లేకపోవడం, బలహీనత, కడుపు నొప్పి, వికారం, విరోచనాలు, బరువు తగ్గడంతో మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. నులిపురు గుల నిర్మూలనతో రక్తహీనత నియంత్రణ, పోష కాల గ్రాహ్యత ను మెరుగుపర్చే ప్రయోజనాలు కలుగజేస్తుంది. ప్రధానంగా అపరిశుభ్రత వల్ల నులి పురుగులు వ్యాపిస్తాయి.ప్రపంచవ్యాప్తంగా, సుమారు 0.8 నుండి 1.2 బిలియన్ ప్రజలు అస్కారియాసిస్తో బాధపడుతున్నారని తెలిపారు.
పోటో:-మాట్లాడుతున్న సిడిపిఓ