వెంకటగిరి ఎక్సప్రెస్ న్యూస్ (రాపూరు) :-
మండలం పరిధిలో నే వేపినాపి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మంగళవారం ఆషాడే మీటింగ్ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ బిందు మీనన్ న్యూరాలజిస్ట్, గారు ఇవాళ వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అందరికీ నరాల బలహీనతలకు సంబంధించి వచ్చే సమస్యల గురించి వివరంగా విశ్లేషణ చేయడం జరిగినది. బ్రెయిన్ స్ట్రోక్ ,పెరలైసిస్ ,ఇటువంటి సమస్య ఏదైనా వచ్చినా కూడా వెంటనే తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరణ ఇవ్వడం జరిగినది.వచ్చిన సిబ్బంది అందరికీ కూడా అర్థమయ్యే విధంగా వివరంగా వివరించడం జరిగినది ఈ కార్యక్రమమునందు డాక్టర్ షాలిని గారు, వేపినాపి వైద్య అధికారులు డాక్టర్ సూర్య ధర్మేంద్ర, డాక్టర్ ప్రమీల రాజకుమారి,డాక్టర్ సుదర్శనమ్మ ,డాక్టర్ భాను గారు,వైద్య ఆరోగ్యశాఖ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు ,సిహెచ్ ఓలు,హెల్త్ అసిస్టెంట్లు,ఆశా కార్యకర్తలు,అందరూ పాల్గొనడం జరిగినది వచ్చిన పేషెంట్స్ అందరిని కూడా వైద్యం చేయడం జరిగినది వారికి తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగినది.