కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్…
కలువాయి మండలం పెన్న బద్వేలు గ్రామం లోని అవధూత వెంకయ్య స్వామి గిరి ప్రదక్షిణ పూజా కార్యక్రమం భక్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఉభయ కర్తలు. బెల్లంకొండ రమణారెడ్డి దంపతులు స్వామి వారికీ పట్టు వస్త్రాలు సమర్పించి గిరి ప్రదక్షిణ పూజ చేశారు. స్వామి వారి మెట్లపై కర్పూరం వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్బంగా ఉభయ కర్తలు అన్న ప్రసాదం భక్తులకు స్వీకరించారు. అనంతరం స్వామి వారికీ భక్తులు భజనలు చేశారు. స్వామి వారి గిరి ప్రదక్షిణ పూజ కు మండలం నుంచి అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొన్నారు.
……….
వెంకయ్య స్వామి ని పల్లకి పై మోస్తున్న భక్తులు.