డక్కిలి : వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్ : నేడు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా డక్కిలి మండల కేంద్రంలో ఘనంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు టిడిపి డక్కిలి మండల అధ్యక్షులు పోలం రెడ్డి కోటేశ్వర్ రెడ్డి ఒక ప్రకటన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన తెలుగుజాతి ప్రజలలో ఎప్పటికీ గుర్తుండిపోయే మహా మనిషి, ఆంధ్రుల ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు అని అన్నారు, ఈ కార్యక్రమానికి మండలంలోని నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు.