కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్..
విశ్వకర్మ యోజన పధకం ద్వారా ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయాన్ని వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ శ్రీ ఎస్. ఎస్. ఆర్ నాయుడు చెప్పారు. కలువాయి మండలం చౌటపల్లి గ్రామ పంచాయతీలో “వికసిత్ భారత్ సంకల్పయాత్ర ” కార్యక్రమమం నకు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ ఎస్. ఎస్. ఆర్ నాయుడు ,ఎంపీడీవో గోవర్ధన్ మండలంలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్య క్రమంలో అధికారులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాల గురించి వివరించారు. ఈ సందర్బంగా ఎస్ ఎస్ ఆర్ నాయుడు మాట్లాడుతూ విశ్వకర్మ యోజన కింద 18 కులాల చేతివృత్తుల వారికి 15 రోజులపాటు శిక్షణ ఇచ్చి ఆ శిక్షణలో రోజుకి 500 రూపాయలు బత్తా ఇచ్చి 15 రోజుల తర్వాత వారికి అవసరమైన 15 వేల రూపాయల వరకు విలువ చేసే పనిముట్లను కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని, అంతేకాకుండా వీటి ద్వారా 5% వడ్డీతో రుణాలు ఇస్తున్నారని వాటిని అందరూ సద్వినియోగపరుచుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కిసాన్ సమ్మాన్ నిధి, అటల్ జి పెన్షన్ అంత్యోదయ యోజన, జీవనజ్యోతి భీమా యోజన, అలా అనేక కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి, వాటి ప్రయోజనాల గురించి వివరించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలందరికీ తెలియజేసే విధంగా అధికారులు చూసుకోవాలని, అర్హులైన వారందరికీ అవి అందేలా చేయాలని,అది ప్రభుత్వ అధికారుల విధి అని తెలియజేశారు. తరువాత గ్రామంలో ఆయుష్మాన్ భారత్ కార్డులు , హెచ్. పి గ్యాస్ కనెక్షన్లు,మరియు నరేంద్ర మోడీ గారి క్యాలెండర్లు, నరేంద్ర మోడీ గారు తొమ్మిది సంవత్సరాల సుపరిపాలన కరపత్రములు, అందరికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్. ఎస్. ఆర్ నాయుడు గారితో పాటు, కలువాయి మండల బిజెపి అధ్యక్షులు గొoది మల్లికార్జున నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి బ్రహ్మ రెడ్డి మహిళా మూర్ఛ సరస్వతమ్మ, నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి,వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు, భారతీయ జనతా పార్టీ మండల మరియు గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.