డక్కిలి మండలం వెంబులూరు తోపిగానిపల్లి, కమ్మపల్లి గ్రామంలో వైఎస్ఆర్సిపి నాయుకులు,వేణు నాయుడు గారు మాధవయ్య పాలెం సొసైటీ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్, తిరుపతి జిల్లాఅధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త గౌరవ శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి అపూర్వ స్వాగతం లభించింది. అనంతరం గ్రామంలోని నాయకులను ఆయన పేరుపేరునా యోగక్షేమాలు అడిగి తెలుసుకుని రాబోయే ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష అయినా 175 కి 175 సీట్లు సాధించేలా ప్రతి కార్యకర్త శక్తి వంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు , తల్లి నేదురు మల్లి రాజ్య లక్ష్మమ్మ గారు డక్కిలి ప్రాంత అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారని వారి స్ఫూర్తి కొనసాగించేలా నాకు అవకాశం ఇవ్వాలని స్థానికలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు…