డక్కిలి : జనవరి 16: డక్కిలి మండలం కమ్మపల్లి గ్రామ వైకాపా నాయకుడు నర్రావుల. వేణుగోపాల్ నాయుడు సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటుచేసిన విందు కార్యక్రమంలో తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త నేదురు మల్లి. రామ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా మిట్ట వడ్డిపల్లి,వెంబులూరు గ్రామంలోని స్థానిక వైకాపా నాయకులుతో మాటమంతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కమ్మపల్లిలో భోజనం అనంతరం గ్రామస్తులు, మండల ముఖ్య నాయకులు స్థానిక నాయకులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ డక్కిలి మండలంలో నాపై ప్రత్యేక అభిమానం కనబరుస్తున్నారని, చాలా గ్రామాలలో మా తండ్రి స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి, మా తల్లి శ్రీమతి రాజ్యలక్ష్మి చేసినటువంటి అభివృద్ధి అనంతరం ఏ నాయకులు చేయలేదని వారిపై విశ్వాసం నమ్మకమే నాపై కనపరుస్తున్నారని అందుకు నాకు చాలా ఆనందంగా గర్వం కూడా ఉందన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పాలన వైకాపాపై ప్రజలు చాలా అభిమానంతో ఉన్నారని, రాబోవు అసెంబ్లీ ఎన్నికలలో నేను వెంకటగిరి శాసనసభ్యునిగా పోటీ చేస్తున్నానని మంచి మెజార్టీతో గెలిపిస్తారని నమ్మకం కూడా నాకు ఉందన్నారు. మొన్న జరిగిన సామాజిక చైతన్య యాత్రలో సైతం డక్కిలి మండలంలో నాయకులు సమిష్టి కృషి చాలా బాగుందని, ప్రజల సైతం ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. చిన్నచిన్న లోట్లపాట్లు సవరించుకొని అందరం కలిసికట్టుగా పార్టీ కోసం పని చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట సీనియర్ నాయకులు చెలికం శంకర్ రెడ్డి, దేవుని వెలంపల్లి దేవస్థానం మాజీ చైర్మన్ ప్రకాష్ నాయుడు, జెసిఎస్ మండల ఇన్చార్జి చింతల శ్రీనివాసరెడ్డి, వైకాపా మండల ప్రెసిడెంట్ పెట్లూరు జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎంపీపీ చెంచయ్య,వేపమాను యువరాజు,ఎమ్మెల్ నారాయణరెడ్డి,కోళ్లపూడి వేణుగోపాల్, పాదిలేటి దశరథ రామ్ రెడ్డి, పలుగోడు రమణారెడ్డి,భాస్కర్ నాయుడు,ఘట్టమనేని శ్రీనివాస్ నాయుడు,అరుణాచలం,వేముల మల్లికార్జున నాయుడు,నడింపల్లి రత్నం నాయుడు,పులకంటి రామారావు, కొమ్మినేని కోటేశ్వరరావు తదితర మండల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.