బాలాయపల్లి (వెంకటగిరి ఎక్స్ ప్రెస్) :-
మండలంలోని పాక పూడి గ్రామంలో అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం అక్షింతలు
ధర్మ ప్రచారక్ రమేష్ ఆధ్వర్యంలో ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిరం పూర్తయిన సందర్భంగా ఆదివారం అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్ పంపించిన అక్షింతలు భక్తి భజన బృందం ఆధ్వర్యంలో అందజేస్తున్నామన్నారు. ప్రతి కుటుంబంలో నీయ మనిష్టలతో ఉపవాసాలు ఉండి అయోధ్యలో రామ మందిరం ప్రారంభ కార్యక్రమానికి ప్రత్యేక పూజలు రామాలయాల్లో నిర్వహించాలని కోరారు అనంతరం గ్రామ పురవీధులలో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు .
ఫోటో:- అక్షింతల పంపిణీ చేస్తున్న దృశ్యం