ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
———————————————-
వెంకటగిరిలోని తన పిఏ వెంకటేశ్వర్లు నివాసానికి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి….
వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముందుగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులతో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పలు విషయాలు మాట్లాడి ధైర్యం చెప్పారు. వారికి తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు