కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్…
సంక్రాంతి పండుగ సందర్బంగా కలువాయి లో గ్రామ దేవత కలువాయమ్మ, చెన్న కేశవ స్వామి వార్ల కు ఘనంగా గ్రామోత్సవం జరిగింది.దేవత మూర్తులను పరిమళ పుష్పాలతో పత్యేకం గా అలంకరణ చేసారు. గరుడ వాహనం పై చెన్న కేశవ స్వామిని గ్రామోత్సవం చేశారు.. ఈ సందర్బంగా కలువాయమ్మ అమ్మ వారిని రధం పై ఎర్పాటు చేసి ఉత్సవం చేశారు. ఈ సందర్బంగా మహిళ భక్తులు పుష్పాహారతిని ఇచ్చారు.రధం ముందు భాగం లో పాటలు పడుతూ భజనలు చేశారు.మంగళ వా యిద్యాలతో ఆకా సువ్వలు పెల్చుతూ కనుల పండువలా గ్రామోస్తవాలు జరిగాయి. కలువాయమ్మ ఉత్సవ కార్యక్రమం లో జడ్పీటీసీ అనీల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.