వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్ : గత 15 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె తో పట్టణంలో ప్రజలు ఎక్కడ చూసినా చెత్త పేరుకు పోయి దుర్గం దాన్ని వెదజల్లడంతో ప్రైవేటు వ్యక్తులతో బుధవారం నుండి పారిశుధ్య పనులను మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు ఆధ్వర్యంలో జరిగింది. ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోవడంతో కార్మికులు రోజురోజుకీ ఉదృతం చేస్తున్న తరుణంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేట్ వ్యక్తం ద్వారా కౌన్సిలర్ల ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు తెలిపారు. మున్సిపల్ పర్మినెంట్ కార్మికులు 16 మంది, ప్రవేట్ వ్యక్తులు 20 మంది ద్వారా రాజా వీధి తూర్పు వీధి ప్రాంతాల్లో పరిశుభ్రతను కాపాడే విధంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలక్కుండా తగు చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు. మున్సిపల్ కార్మికులు ప్రైవేటు వ్యక్తుల ద్వారా పని చేయించడం తగదని మా యొక్క న్యాయమైన కోరికలను పరిష్కరించకుండా ఇంతకాలం పనిచేసిన మమ్మల్ని పక్కనపెట్టి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా చేయించడం ఈ ప్రభుత్వానికి తగ్గునని పనులు చేయకుండా అడ్డుపడడంతో పోలీసులు మున్సిపల్ కార్మికులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎన్ని అరెస్టు చేసిన మా సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె ఆపమని కార్మికుల హెచ్చరించారు.