వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్ : ఈ 2024వ సంవత్సరం భవిష్యత్తు తీర్పునిచ్చే సంవత్సరం వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్త రామకుమార్ రెడ్డి తన నివాసంలో ఐ న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరిస్తూ ఆసక్తికరమైన వాక్యాలు చేశారు. ఐదు సంవత్సరాలుగా మీతో నడిచి మిమ్మల్ని కాపాడుకుంటున్న ప్రభుత్వం ఒకవైపు, మాయమాటలు చెప్పి మాటమీద నిలబడకుండా అధికారం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ఇచ్చిన హామీ వదిలేసే ప్రభుత్వం ఒకవైపు. అందుకే జగన్మోహన్ రెడ్డి చెప్తుంటారు, మనం ఇచ్చిన మాట మీద నిలబడ్డాం, ఓటు అడిగే హక్కు మనకుంది ధైర్యంగా ఇంటికి వెళ్లి చెప్పండి మనం చేసిన పని అని తెలిపారు. అందుకే ఓటిన్నర సంవత్సర క్రితమే మొదలుపెట్టి ఇంటింటికి వెళ్లిగడపగడప మన ప్రభుత్వం, ఆ ధైర్యంతోనే రేపు రాబోవు ఎలక్షన్ లో వైఎస్ఆర్ వైయస్సార్ పార్టీకి ఓటేయమని అడుగుతున్నాం అన్నారు. వై నాట్ 175 అనే నినాదంతో మేము కచ్చితంగా బరిలోకి దిగి అన్ని సీట్లు గెలుస్తామనే నమ్మకంతో ఉన్నామన్నారు. ఇన్ని సంవత్సరాలుగా ఎవరు చేయలేని, మన రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కూడా ఈనెల 19వ తేదీన విజయవాడ నడిబొడ్డున 125 అడుగులు, 404 కోట్ల ఖర్చుచేసి జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారని తెలియజేశారు. ఇన్ని మంచి పనులు చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మరొకసారి మనమందరం ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి రూరల్ వైసిపి అధ్యక్షులు కల్తీ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు ఎల్ కోటేశ్వరరావు, నక్క వెంకటేశ్వరరావు, పుల్లూరు సదానంద రెడ్డి, గోపాల్ కృష్ణ, వేణుగోపాల్ రెడ్డి, తదితరులున్నారు.