వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్: తిరుపతి జిల్లాడక్కిలి మండల కార్యాలయంలో విజయవాడలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ పోస్టల్ కార్యక్రమను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్ నేదురు మల్లి రాం కుమార్ రెడ్డి ఆవిష్కరించా రు .అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో సామాజిక న్యాయం కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఉద్యమించినారని రాజ్యాంగ నిర్మాణ ఆవశ్యకతను గ్రహించి, ప్రజాస్వామ్య విలువలు నిలబెట్టడమే కాకుండా చారిత్ర క అన్యాయాలను పరిష్కరించేవిధంగా రాజ్యాంగాన్ని ఆయన రూపొందించరన్నారు .అదేవిధంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్ స్ఫూర్తి పొంది ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యతనిస్తూ సమ్మిళిత పాలన, సమగ్ర సామాజిక న్యాయ విధానాలపై దృష్టి సారించారని తెలిపారు . సంక్షేమ ప్రయోజనాలు ఎటువంటి వివక్షలేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలుచేరేలా అతని పరిపాలన చూస్తుందన్నారు . రాజ్యాంగ నిర్మాత వారసత్వాన్ని స్మరించుకునేందుకు సీఎం 404 కోట్లతో అంబేద్కర్ స్కృతి వనమును నిర్మిస్తున్నరన్నారు . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశంలోని అత్యంత ఎత్తైన విగ్రహని ఆవిష్కరిస్తున్న సందర్భంగా అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు . ఈ కార్యక్రమంలో డక్కిలి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గోను రాజశేఖర్ ,డక్కిలి మండల ఎంపీడీవో ప్రశ్నకుమారి,వైసిపి నాయకులు పాల్గొన్నారు.