వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్: తిరుపతి జిల్లా వెంకటగిరి పట్నం మున్సిపాలిటీ పరిధిలో 14 వ వార్డు సచివాలయం నందు బుధవారం కౌన్సిలర్ ఆరి శంకరయ్య ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో నిర్వహించారు. ఈ ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంలో సచివాలయ పరిధిలోని 14 15 వార్డులలో ప్రజలు ఆరోగ్య సమస్యలను పరీక్షించుకుని డాక్టర్ ద్వారా తగు సలహాలు సూచనలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఆది శంకరయ్య మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష పథకం పేదలకి వరమన్నారు. ప్రజలు తమ ఆరోగ్య విషయాలను ప్రభుత్వ ఏర్పాటు చేసిన ఫ్యామిలీ డాక్టర్ దగ్గర పరీక్షించుకునే వారికున్న రోగాలను నివారించడానికి ఇదొక చక్కని అవకాశం అని ఈ ప్రభుత్వ సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది డాక్టర్లు, నర్సులు పాల్గొన్నారు.