వెంకటగిరి ఎక్స్ప్రెస్ : తిరుపతి జిల్లా డక్కలి మండలం ఎలుకలు గ్రామంలో తిరుపతి జిల్లా వనరుల శాఖ ఆధ్వర్యంలో రైతులకు మూల విత్తన శిక్షణ కార్యక్రమం మంగళవారం జిల్లా వనరుల శాఖ ఏడిఏ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విత్తనాలను రైతుల చేసుకొనే విధంగా శిక్షణ ఏర్పాటు చేశామని ఆయా గ్రామాలలో రైతులను ఎంపిక చేసి వారికి మూల విత్తనం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఆ మూల విత్తనం ద్వారా రైతులు పంట పండించి అధిక దిగుబడి సూచించినట్లు తెలిపారు. వెంకటగిరి ఏడిఏ నాగార్జునసాగర్ మాట్లాడుతూ మూల విత్తనం ద్వారా పండించిన నాణ్యమైన పంటను ఆ గ్రామ చుట్టుపక్క గ్రామాల వారికి విత్తనాలకు అమ్మకాలు చేయాలని తద్వారా మిగిలిన రైతులు కూడా నాణ్యమైన పంటను అధిక దిగుబడిని లాభాలను పొందుతారని సూచించారు. రైతులకు ఇవ్వకుండా వ్యాపారస్తులకు అమ్మ రాదని శిక్షణలో పాల్గొన్న రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వనరుల శాఖ ఏవో వేణుగోపాల్, శ్రీనివాసులు, డక్కలీ ఏవో విజయభారతి రైతులు పాల్గొన్నారు.