అమరావతి..
ఈ రోజు రేపు ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించనుంది. ఈ సందర్భంగా రానున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా సవరణ, సన్నద్ధత వంటి అంశాలను పరిశీలించనుంది కేంద్ర ఎన్నికల సంఘం..
నిన్న రాత్రే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని టీం విజయవాడ చేరుకుంది. ఈ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కానుంది. ఇక ఇవాళ మధ్యాహ్నం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం..