పెంచలకోనలో ప్రత్యేక పూజలు
వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన డాక్టర్ మస్తాన్ యాదవ్ ఈ రోజు పెంచలకోన లో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో బాగుండాలని స్వామివారిని కోరుకున్నారు.రాపూరు మాజీ సర్పంచ్ తుమ్మలపల్లి మధుసూదన్ రావు మరియు రాపూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు రాపూరు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర భారీ కేకు ఏర్పాటు చేశారు. డాక్టర్ మస్తాన్ యాదవ్ పాల్గొని భారీ కేక్ కట్ చేశారు.అనంతరం రాపూర్ మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరూ డాక్టర్ మస్తాన్ యాదవ్ శుభాకాంక్షలు తెలియజేశారు.రాష్ట్ర కార్యదర్శిగా నాకు అవకాశం కల్పించినందుకు మా అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు మా అన్న జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు , రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కింజారపు అచ్చం నాయుడు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.ఈ కార్యక్రమంలో దక్షిణ భారతదేశ చార్టెడ్ అకౌంటెంట్ అధ్యక్షులు(2022-2023) CA.చిన్న మస్తాన్ ,బిక్కీఅంకయ్య చంద్రశేఖర్ రెడ్డి, వెంకటేష్ మరియు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు, డాక్టర్ మస్తాన్ యాదవ్ స్నేహితులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.