3 నిం దుతులు అరెస్ట్.
10 సవర్ల బంగారం స్వాధీనం.
కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ :
కలువాయి మండలం కుల్లూరు లో ఓ ఇంట్లో చోరీ చేసిన సొమ్ము ను కలువాయి ఎస్ ఐ అయ్యప్ప, సిబ్బంది చేదించారు. సొమ్ము రికవరీ తో పాటు చోరీ కి పాల్పడ్డ ముగ్గురు నిందుతులను పోలీసులు పట్టుకొని ఆత్మకూరు కోర్టు కు హాజరు పరిచారు. చోరీ కి సంబందించిన వివరాలను రాపూరు సీఐ సుబ్రహ్మణ్యం వివరించారు.కలువాయి మండలం కుల్లూరు లో ఎస్ సి కాలనీలో నివాసం ఉన్న పెంచలయ్య ఇంట్లో డిసెంబర్ నెల 31 వ తేది చోరీ జరిగింది. నిందుతులను ఎస్ ఐ అయ్యప్ప, సిబ్బంది కలసి కుల్లూరు బస్టాండ్ సెంటర్ లో పట్టుకొన్నారు. వారి వద్ద నుంచి 10 సంవర్లు బంగారం స్వాధీనం చేసుకొన్నారు.చోరీ సొమ్ము రికవరీ, నిందుతులను చాక్కచక్యం గా పట్టుకోవడం తో జిల్లా ఎస్ పి తిరుమలేశ్వర్ రెడ్డి ఎస్ ఐ అయ్యప్ప, సిబ్బంది ని అభినందించారు.అరెస్ట్ చేసిన నిందుతులను ఆత్మకూరు కోర్టు కు హాజరు పరిచారు.